Featured

Sotrovimab | Another Antibody Treatment for Covid 19 | Gets Approval from UK



Published
తీవ్రమైన కరోనా లక్షణాల ముప్పు ఉన్నవారి కోసం....సోట్రోవిమాబ్ అనే ఔషధానికి బ్రిటన్ అనుమతి ఇచ్చింది. ఒమిక్రాన్ సహా కొత్త వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుందని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. తేలికపాటి నుంచి పరిమిత లక్షణాలున్న వారిని.......తీవ్రమైన రోగ లక్షణాల ముప్పు నుంచి కాపాడేందుకు....ఉపయోగపడుతుందని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ మోనోక్లోనల్ సింగిల్ డోసు ఔషధాన్ని.......GSK, వీర్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేశాయి. వైరస్ వెలుపల ఉండే ప్రోటీన్ వ్యాప్తిని బంధించడం ద్వారా.......ఈ ఔషధం పనిచేస్తుందన్నారు. వైరస్ అంటుకోకుండా, మానవకణాల్లో ప్రవేశించకుండా అడ్డుకోవటం ద్వారా ....శరీరంలో వ్యాప్తి చెందకుండా చూస్తుందన్నారు. వైరస్ లక్షణాలు కలిగి అధిక ముప్పు ఉన్నవారికి..... ఆస్పత్రిలో చేరికతోపాటు మరణాలను 79శాతం తగ్గిస్తుందని ప్రయోగపరీక్షల్లో వెల్లడైందన్నారు. ప్రయోగ పరీక్షల డేటా ఆధారంగా....ఇన్ ఫెక్షన్ ప్రాథమికదశలో ఉన్న సమయంలో సోట్రోవిమాబ్ అత్యంత సమర్థంగా పనిచేస్తుందన్న బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ......వీలైనంత త్వరగా........వైరస్ సోకిన 5రోజుల్లోగా తీసుకోవాలని సిఫార్స్ చేసింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment