Featured

Puzzling Outbreak Of Liver Disease In Kids Spreads to EU, US



Published
అమెరికా, ఐరోపా దేశాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలకు....అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 12 దేశాల్లో 169 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఇప్పటికే ఒక చిన్నారి మృతి చెందినట్లు పేర్కొంది. ప్రధానంగా బ్రిటన్ లో ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని 'అంతుచిక్కని మూలాలతో వచ్చే అతి తీవ్ర హెపటైటిస్ 'గా పేర్కొంది. వ్యాధి బారిన పడినవారంతా... ఒక నెల నుంచి 16 ఏళ్ల వయసు వారేనని W.H.O వివరించింది. వీరిలో 17 మందికి...... కాలేయమార్పిడి అవసరమైనట్లు తెలిపింది. అయితే....... ఈ వ్యాధితో ఏ దేశంలో మరణం సంభవించిందనే విషయాన్ని వెల్లడించలేదు. 74 కేసుల్లో అడినోవైరస్ ను గుర్తించగా... మరో 20 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బ్రిటన్ లో తొలిసారి.. ఇలాంటి కేసులు నమోదు కాగా........ అక్కడ 114 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. సాధారణంగా జలుబుకు కారణమయ్యే వైరస్ తో ఈ కేసులకు సంబంధం ఉండొచ్చని..... నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడినోవైరస్ ఈ వ్యాధికి కారణం కావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. వ్యాధి కారకాలను కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment